అభిమానిపై చేయి చేసుకున్న బాలయ్య !

అభిమానిపై చేయి చేసుకున్న బాలయ్య !

Published on Aug 17, 2017 12:55 PM IST


కొద్దిరోజుల క్రితమే షూటింగ్ స్పాట్లో అసిస్టెంట్ పట్ల దురుసుగా ప్రవర్తించి విమర్శలు ఎదుర్కున్న నటుడు, పొలిటీషియన్ బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా నంద్యాలలో జరగనున్న ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనేందుకు బాలకృష్ణ అక్కడికి వెళ్లారు. ఉదయం ప్రచారం ముగించుకుని తిరిగి బస చేస్తున్న హోటల్ కు వెళ్లారు.

అంతలోనే అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడి ఆయను పూల మాలలతో సత్కరించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడ చోటు చేసుకున్న చున్నపాటి తోపులాటలో ఒక అభిమాని బాలకృష్ణపై పడబోయాడు. దీనికి కోపగించుకున్న బాలకృష్ణ వెంటనే ఆ అభిమానిని చెంపదెబ్బ కొట్టారు. ఈ వ్యవహరం మొత్తం ఈ వీడియో రూపంలో బయటికొచ్చి ప్రస్తుతం సంచలనంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు