గుంటూరులో నాన్ బాహుబలి-2 రికార్డ్ సృష్టించిన ‘భరత్ అనే నేను’ !

గుంటూరులో నాన్ బాహుబలి-2 రికార్డ్ సృష్టించిన ‘భరత్ అనే నేను’ !

Published on Apr 21, 2018 10:36 AM IST


భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ‘భరత్ అనే నేను’ చిత్రం మొదటి షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హిట్ టాక్ తో పాటు పలు ఏరియాల్లో నాన్ బాహుబలి-2 రికార్డుల్ని సైతం బ్రేక్ చేసే ఓపెనింగ్స్ రాబట్టుకుందీ చిత్రం. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా గుంటూరు జిల్లాలో తొలిరోజు రూ.4.03 కోట్ల షేర్ ను కొల్లగొట్టింది.

దీంతో ఇన్నాళ్లు రూ.3.79 కోట్లతో పవన్ ‘అజ్ఞాతవాసి’ పేరు మీదున్న నాన్ బాహుబలి-2 రికార్డ్ మహేష్ యొక్క ‘భరత్ అనే నేను’ సొంతమైంది. అలాగే మహేష్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న కృష్ణా జిలాల్లో సైతం సినిమా మొదటిరోజు రూ.1.92 కోట్ల షేర్ ను వసూలు చేసి నాన్ బాహుబలి-2 రికార్డ్ సృష్టించింది. ఇక శని, ఆదివారాలు వారాంతపు రోజులు కావడంతో ఈ వసూళ్లు ఇలాగే స్టడీగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు