ఆస్ట్రేలియాలో కూడ నాన్ బాహుబలి రికార్డ్స్ ని సృష్టించిన ‘భరత్ అనే నేను’ !

ఆస్ట్రేలియాలో కూడ నాన్ బాహుబలి రికార్డ్స్ ని సృష్టించిన ‘భరత్ అనే నేను’ !

Published on Apr 23, 2018 10:25 AM IST

ఈ నెల 20న విడుదలైన ‘మహేష్ బాబు’ యొక్క ‘భరత్ అనే నేను’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ చిత్రం యూఎస్, ఆస్ట్రేలియా దేశాల్లో సైతం బ్రహ్మాండమైన వసూళ్లను రాబడుతోంది. మొదటిరోజు ఆస్ట్రేలియాలో 1.68 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను ఖాతాలో వేసుకున్న ఈ సినిమా శని, ఆదివారాల్లో కూడ మెరుగైన ప్రదర్శన కనబర్చింది.

శనివారం 1.16 లక్షలు, ఆదివారం 54,922 ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసి మొత్తంగా 3.39 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను అందుకుని ఓపెనింగ్స్ పరంగా సౌత్ ఇండియన్ సినిమాల్లో ‘బాహుబలి’ తర్వాతి స్థానంలో నిలబడింది. మరోవైపు రామ్ చరణ్ ‘రంగస్థలం’ కూడ 2.89 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసి మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే ‘భరత్ అనే నేను’ యూఎస్లో ఇప్పటికే 2 మిలియన్లను క్రాస్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు