‘భరత్ అనే నేను’లో ముఖ్యమైన సమస్యల్ని ప్రస్తావిస్తారట !

‘భరత్ అనే నేను’లో ముఖ్యమైన సమస్యల్ని ప్రస్తావిస్తారట !

Published on Mar 24, 2018 2:00 PM IST

మహేష్ బాబు, కొరటాల శివల ‘భరత్ అనే నేను’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రతి సినిమాకి ఏదో ఒక సామాజిక సందేశాన్ని బలంగా వివరించి చెప్పే కొరటాల శివ ఈ చిత్రంలో కుడ పలు ముఖ్యమైన సామాజిక సమస్యల్ని ప్రస్తావించారని వినికిడి.

మహేష్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కనిపించనున్న ఈ సినిమాలో విద్యావ్యవస్థ, వైద్య రంగం, పేద ప్రజలు, నిరుద్యోగం, ప్రభుత్వ, ప్రవేట్ రంగాల్లో జరుగుతున్న అవినీతి వంటి అంశాలను టచ్ చేశారట. మరి ఇన్ని హాట్ టాపిక్స్ ను టార్గెట్ చేసిన ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలంటే ఏప్రిల్ 20 వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రం నుండి మొదటి పాట రేపు ఉదయం 10 గంటలకు విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు