చివరి సాంగ్ షూట్ లో అల్లరోడి ‘బందిపోటు’

చివరి సాంగ్ షూట్ లో అల్లరోడి ‘బందిపోటు’

Published on Nov 23, 2014 8:20 PM IST

Bandipotu
‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’తో సక్సెస్ అందుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘బందిపోటు’. ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాలో మిగిలి ఉన్న రెండు పాటల షూటింగ్ కోసం ఈ చిత్ర టీం యూరప్ వెళ్ళారు. గత శుక్రవారం కల్లా ఓ పాట షూట్ ని పూర్తి చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం మూవీలో చివరి సాంగ్ ని షూట్ చేస్తోంది.

ఈ పాటని మిలాన్ నుంచి 400కిమీ దూరంలో ఉన్న గ్రీన్ లాండ్స్ లో షూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ గ్రీన్ లాండ్స్ పాత్రంలో లైట్ గా మంచు కురుస్తుండడంతో విజువల్స్ చాలా బాగా వస్తున్నాయని ఈ చిత్ర టీం అంటోంది. ఈ నెల 26 కల్లా ఆ సాంగ్ షూటింగ్ ని కూడా ఫినిష్ చేసి ఈ చిత్ర టీం ఇండియాకి తిరిగి రానున్నారు.

నరేష్ సరసన ఈషా జంటగా నటించిన ఈ సినిమాలో శ్రద్ధా దాస్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. ఇ.వి.వి. సినిమా పతాకంపై నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు