బండ్ల గణేష్ దక్కించుకున్న ‘2 కంట్రీస్’ రీమేక్ రైట్స్

బండ్ల గణేష్ దక్కించుకున్న ‘2 కంట్రీస్’ రీమేక్ రైట్స్

Published on Feb 10, 2016 4:12 PM IST

Bandla-Ganesh1
నటుడిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా మీదున్న మక్కువతో నిర్మాతగా మారి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ ని స్థాపించి పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, రవితేజ లాంటి స్టార్ హీరోస్ తో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి ఆ బ్లాక్ బస్టర్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్న నిర్మాత ‘బ్లాక్ బస్టర్’ బండ్ల గణేష్. గత ఏడాది ‘టెంపర్’ తో సూపర్ హిట్ అందుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత మరో సినిమాని ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. దానికి కారణం మంచి కథల కోసం ఎదురు చూస్తుండడం. ఇలా కొత్త కథలు వింటూనే, మంచి కథ దొరికితే రీమేక్ చేద్దాం అని పర భాషలో వచ్చిన సినిమాలపై కూడా ఓ కన్నేశారు.

అలా గత ఏడాది మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘2 కంట్రీస్’ అనే సినిమా బండ్ల గణేష్ కి బాగా నచ్చింది. మలయాళ స్టార్ హీరో దిలీప్, మమత మోహన్ దాస్, ఇషా తల్వార్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో రూపొంది 50 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో ఆయన ఈ సినిమా రీమేక్ చేద్దాం అని ఫిక్ అయ్యారు. కానీ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం బండ్ల గణేష్ తో పాటు తెలుగు ఇండస్ట్రీలోని పలు టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా పోటీ పడ్డాయి. ఈ ఆసక్తికర పోటీలో ఫైనల్ గా ఓ ఫ్యాన్సీ ప్రైజ్ కి బండ్ల గణేష్ ‘2 కంట్రీస్’ రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నాడు. ఓ మంచి సినిమాని తన బ్యానర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఆయన ఫ్యాన్సీ అమౌంట్ పెట్టి రీమేక్ రైట్స్ తీసుకున్నారు.

ఈ మధ్య కాలంలో వరుసగా మలయాళం సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. అలా వచ్చిన దృశ్యం పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం ప్రేమమ్ కూడా తెలుగులోకి రీమేక్ అవుతోంది. ఇప్పుడు అదే బాటలో బండ్ల గణేష్ భారీ ఎత్తున, స్టార్ నటీనటులతో ‘2 కంట్రీస్’ తెలుగులో రీమేక్ చేయడానికి సిద్దం అయ్యారు. ఈ బ్లాక్ బస్టర్ కంటెంట్ తో బండ్ల గణేష్ మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం పక్కా అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు