నిర్మాత బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారా ?

నటుడి నుండి అకస్మాత్తుగా నిర్మాతగా మారి రవితేజతో ‘ఆంజనేయులు’ సినిమాని నిర్మించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘తీన్ మార్, గబ్బర్ సింగ్’, ఎన్టీఆర్ తో ‘బాద్షా, టెంపర్’, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో ఒక్కో సినిమా చేసి స్టార్ ప్రొడ్యూసర్ గా వార్తల్లో నిలిచిన బండ్ల గణేష్ చివరగా 2015 లో చేసిన ‘టెంపర్’ చిత్రం చేసి ఆ తర్వాత నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఆయన మరోసారి ప్రొడక్షన్లోకి దిగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అది కూడా తనతో మొదటి సినిమా చేసిన రవితేజతోనే కావడం విశేషం. అలాగే ఈ సినిమాకి దర్శకుడిగా ఇదివరకు తనతో పనిచేసిన దర్శకుడినే తీసుకోవాలని గణేష్ భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై గణేష్ నుండిగాని, రవితేజ నుండిగాని ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలోనే ఉండే అవకాశాలున్నాయి.

 

Like us on Facebook