మంచి లాభాలను అందిస్తున్న భరత్!

మంచి లాభాలను అందిస్తున్న భరత్!

Published on Apr 22, 2018 6:00 PM IST

మహేష్ బాబు – భరత్ అనే నేను సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఊహించిన దానికంటే ఎక్కువగానే చిత్రానికి మంచి ఆదరణను అందుకుంటోంది. దాదాపు అన్ని ఏరియాల నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే సినిమా 100 కోట్ల గ్రాస్ ను అందుకొని బయ్యర్లకు మంచి లాభాలను అందిస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా ఉత్తరాంధ్రా లో ఎవరు ఊహించని విధంగా మంచి గ్రాస్ ను అందుకుంది.

మొదటి రెండు రోజుల్లో తరువాత అక్కడ 3.98 కోట్ల షేర్స్ ను అందించింది. రానున్న రోజుల్లో కూడా అన్ని ఏరియాలలో ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో 2 మిలియన్ల డాలర్లను అందుకొని భరత్ అనే నేను సరికొత్త రికార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డివివి.దానయ్య నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు