రేపే బాపు గారి అంతిమయాత్ర.!

రేపే బాపు గారి అంతిమయాత్ర.!

Published on Sep 1, 2014 2:02 PM IST

bapu1
లెజండ్రీ దర్శకుడు మరియు ఫేమస్ కార్టూనిస్ట్ బాపు గారు నిన్న సాయంత్రం గుండెనొప్పితో చెన్నైలో మరణించారు. ఈ విషయం తెలియడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరియు తెలుగు సినీ ప్రేక్షకులు దిగ్బ్రాంతికి గురయ్యారు.

రేపు ఉదయం చెన్నై లోని బసంత్ నగర్ లో బాపు గారికి సాంప్రదాయబద్దంగా దహన సంస్కారాలు చేయనున్నారు. పలు బ్భాశాల నుంచి ఎంతోమంది సెలబ్రిటీస్ వస్తుండడం వల్ల బాపు గారి కుటుంబసభ్యులు రేపటి వరకూ బాపు గారి మృతదేహాన్ని సందర్శకుల కోసం ఉంచనున్నారు. తెలుగు సినిమాకి బాపు గారు లేకపోవడం తీరని లోటు, అంతే కాకుండా ఆయన లోటుని ఎవరూ భర్తీ చేయలేరు. మన తెలుగు ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది ప్రముఖులు చెన్నై పయనమయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు