పవన్ పంచ్ డైలాగ్ ఇప్పుడు బ్రహ్మానందం మూవీ టైటిల్?

పవన్ పంచ్ డైలాగ్ ఇప్పుడు బ్రహ్మానందం మూవీ టైటిల్?

Published on Apr 22, 2014 4:16 PM IST

Brahmanandam
కామెడీ కింగ్ బ్రహ్మానందం అనగానే గుర్తొచ్చేది పొట్టచెక్కలయ్యే కామెడీ.. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలో ఎవరున్నా లేకపోయినా బ్రహ్మానందం మాత్రం ఒక రెండు సీన్స్ లో అన్నా కనిపించాలి. ఈ మధ్య సినిమాల పరిస్థితి ఎలా మారిపోయింది అంటే బ్రహ్మానందం రోల్ హిట్ అయితే చాలు ఫ్లాప్ అయ్యే సినిమా యావరేజ్ గా, యావరేజ్ సినిమా హిట్ గా, హిట్ సినిమా సూపర్ హిట్ గా ప్రమోట్ అయిపోతున్నాయి. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణే రీసెంట్ గా వచ్చిన ‘రేసు గుర్రం’ మూవీ.

కమెడియన్ గా ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించిన బ్రహ్మానందం హీరోగా మాత్రం హిట్ అందుకోలేకపోయాడు. హీరోగా చేసిన మొదటి సినిమా బాబాయ్ నుంచి మొన్న వచ్చిన జెఫ్ఫా వరకూ అన్నీ పరాజయాన్నే మిగిల్చాయి. అయినా సరే బ్రహ్మానందం హీరోగా మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించు కోనున్నాడు.

తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బ్రహ్మానందం హీరోగా త్వరలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ లో చెప్పిన ఫేమస్ డైలాగ్ ‘నాక్కొంచం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇటీవలే వచ్చిన ‘బసంతి’ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని నిర్మిస్తారు. త్వరలోనే ఈ మూవీ వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు