పాజిటివ్ మౌత్ టాక్ తో పికప్ అయిన ‘బీరువా’

పాజిటివ్ మౌత్ టాక్ తో పికప్ అయిన ‘బీరువా’

Published on Jan 26, 2015 1:50 PM IST

beeruva-review
టాలీవుడ్ యంగ్ హీరో అయిన సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ‘బీరువా’. ఈ సినిమా గత శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు కాస్త మిక్స్డ్ టాక్ వినిపించినా ఆ తర్వాత రోజు నుంచి ప్రేక్షకుల నుంచి కాస్త పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకి ప్రేక్షకాదరణ పెరిగింది. మొదటి రెండు రోజుల కంటే మూడవ రోజు నుంచి ఈ సినిమాకి ప్రేక్షకాదరణ పొందడంతో కలెక్షన్స్ కూడా బాగా పెరిగాయి. ఈ సినిమాలో సందీప్ కిషన్ సప్తగిరి, శకలక శంకర్ తో కలిసి చేసిన కామెడీ ఈ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది.

సందీప్ కిషన్ ఈ సినిమాలో అల్లరి చేస్తూ నవ్వించే ఆకతాయి కుర్రాడి పాత్రలో కనిపించాడు. హీరోయిన్స్ సురభి, అనీషా సింగ్ గ్లామర్ కూడా ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. మంచి కథా బలం ఉన్న సినిమాలను అందించే ఆనంది ఆర్ట్స్ – ఉషా కిరణ్ ఫిలిమ్స్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. కన్మణి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. డైరెక్టర్ కన్మణి దర్శకుడిగానే కాకుండా సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ మామయ్యగా కనిపించి ఆడియన్స్ ని కాస్త నవ్వించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు