విలన్స్ పని పడుతున్న రవితేజ – బ్రహ్మి

విలన్స్ పని పడుతున్న రవితేజ – బ్రహ్మి

Published on Jul 30, 2015 8:34 AM IST

raviteja-brahmi
మాస్ మహారాజ్ రవితేజ నటించిన సూపర్ హిట్ సీక్వెల్ ‘కిక్ 2’ చినెఆ ఆగష్టు 21న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. కిక్ 2 టీం ప్రస్తుతం ప్రమోషన్స్ ని స్పీదప్ చేసే పనిలో ఉన్నారు. ఇది కాకుండా రవితేజ నటిస్తున్న ‘బెంగాల్ టైగర్’ సినిమా కూడా సెట్స్ పై ఉంది. రవితేజ బెంగాల్ టైగర్ సినిమాని అప్పుడే ఫినిషింగ్ స్టేజ్ కి తీసుకొచ్చారు. ఇప్పటికే 85% షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అది కూడా రవితేజ – బ్రహ్మానందంలపై ఒక యాసహ్న్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు.

విలన్స్ పని పెట్టాలని వెళ్ళిన రవితేజ – బ్రహ్మానందంలు వారిని కాసేపు తమ కామెడీ స్టైల్లో కాసేపు ఆటపట్టించి ఆ తర్వాత రవితేజ తన స్టైల్లో విలన్స్ ని చితకబాదాడు. రామ్ లక్షం మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ని రామోజీ ఫిల్మ్ సిటీ రోడ్లపై షూట్ చేస్తున్నారు. రవితేజ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా, హాట్ బ్యూటీ రాశి ఖన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఆగష్టు కల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయనున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. బొమన్ ఇరానీ, నాజర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు