‘బేతాళుడు’ ఫస్ట్‌డే కలెక్షన్స్!

‘బేతాళుడు’ ఫస్ట్‌డే కలెక్షన్స్!

Published on Dec 2, 2016 6:19 PM IST

bethaludu1
‘బిచ్చగాడు’ అన్న ఒకే ఒక్క సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సంపాదించిన విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం ‘బేతాళుడు’ (తమిళంలో సైతాన్) నిన్న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. తమిళంలో ఎక్కడిలేని క్రేజ్ ఉన్న ఈ సినిమాకు తెలుగులోనూ అదేస్థాయిలో క్రేజ్ కనిపించింది. ఈ నేపథ్యంలోనే సుమారు 500లకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు మంచి ఓపెనింగ్స్‌నే సాధించింది.

ఫస్టాఫ్‌లో అదిరిపోయే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ సినిమా సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేకున్నా, ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి ఆదరణే కనిపిస్తోందట. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని మొదటిరోజు ఈ సినిమా 1.30 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. శుక్ర, శని, ఆదివారాల లాంగ్ వీకెండ్ సినిమాకు కలిసిరానుంది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ తన సొంత బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు