ఒకరోజు ముందే వచ్చేస్తోన్న ‘బేతాళుడు’!
Published on Nov 21, 2016 8:40 pm IST

bethaludu1
‘బిచ్చగాడు’ అనే ఒకే ఒక్క సినిమాతో తెలుగులో హీరోగా స్టార్‌డమ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ, తాజాగా ‘సైతాన్’ అనే సినిమాతో వస్తోన్న తెలిసిందే. తమిళంలో భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాను తెలుగులో ‘బేతాళుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ట్రైలర్‌తో ఇక్కడ కూడా విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా, నోట్ల రద్దు వల్ల డిసెంబర్ 2కు వాయిదా పడింది. ఇక తాజాగా మళ్ళీ సినిమాను ఒకరోజు ముందే తీసుకురానున్నట్లు టీమ్ స్పష్టం చేసింది.

తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 1నే సినిమా విడుదలవుతుందని టీమ్ తెలిపింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఏకంగా పది నిమిషాల సినిమాను ఆన్‌లైన్లో విడుదల చేసి సంచలనం సృష్టించిన విజయ్ ఆంటోనీ, సినిమా విజయంపై ధీమాగా ఉన్నారు. ప్రదీప్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించారు. ఓ హర్రర్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కింది.

 
Like us on Facebook