చారిత్రిక నైపథ్యంతో సినిమా తీయనున్న ‘భాగమతి’ దర్శకుడు !

చారిత్రిక నైపథ్యంతో సినిమా తీయనున్న ‘భాగమతి’ దర్శకుడు !

Published on Mar 17, 2018 5:59 PM IST

ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘భాగమతి’ కూడ ఒకటి. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇప్పుడీ దర్శకుడు తన తర్వాతి సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించనున్నారు. 1914 లో జరిగిన కోమగటు మరు ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారాయన.

ఈ చిత్రాన్ని నిర్మాత మహమ్మద్ అలీ తన పెన్ అండ్ ప్రొడక్షన్స్ కంపెనీతో పాటు కెనడియన్ ఫిల్మ్ కౌన్సిల్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం జాతీయ, అంతర్జాతీయ నటీ నటుల్ని తీసుకొనున్నారు. జూన్ నెలలో మొదలుకానున్న ఈ చిత్రాన్ని ఇండియా, కెనడ, హాంగ్ కాంగ్, చైనాలలో చిత్రీకరించనున్నారట. 1914లో బ్రిటిష్ రాజ్ నుండి 376 మంది ప్రయాణీకులతోజపాన్ ఓడ కోమగటు మరు కెనెడాకు బయలుదేరుతుంది. కానీ కెనడా ప్రభుత్వం వలలను దేశంలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఇదే కోమగటు మరు ఉదంతం యొక్క నైపథ్యం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు