భాగమతి సెన్సార్ వివరాలు !
Published on Jan 18, 2018 1:37 pm IST

అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి ప్రత్యేకమైన సినిమాలలో తనదైన అభినయంతో ప్రేక్షకుల్లో చరగని ముద్ర వేసుకున్న అనుష్క తాజాగా భాగమతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాకు అశోక్ దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించాడు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. అనుష్క ఈ సినిమాలో రెండు విభిన్న లుక్స్ లో కనిపించబోతోంది. యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ విడుదల తరువాత సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమాతో అనుష్క మరో విజయం సాధించి ఇలాంటి మరెన్నో సినిమాల్లో నటించాలని కోరుకుందాం.

 

Like us on Facebook