ఆస్ట్రేలియాలో తన స్టామినాను ప్రూవ్ చేసుకున్న మహేష్ !
Published on Apr 21, 2018 10:57 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలంటే కేవలం అమెరికాలో మాత్రమే కాక ఆస్ట్రేలియాలో సైతం మంచి క్రేజ్ ఉంది. అందుకే డిస్ట్రిబ్యూటర్లు సినిమాను రికార్డ్ స్థాయిలో 35 లొకేషన్లలో విడుదలచేశారు. ఈ భారీ విడుదలతో తొలిరోజు శుక్రవారం ఈ సినిమా ఊహించినదానికంటే బాగా పెర్ఫార్మ్ చేసి 1.68 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను ఖాతాలో వేసుకుంది.

దీంతో నిన్నటి వరకు ఆస్ట్రేలియాలో మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో 1.65 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్న ‘రంగస్థలం’ను క్రాస్ చేసింది ‘భరత్ అనే నేను’. ఇలా అన్ని ఏరియాల నుండి వస్తున్న హిట్ టాక్ తో మహేష్ ఖాతాలో మరొక అపురూప విజయం ఖాయమైంది.

 
Like us on Facebook