టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం తరువాత బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబడుతోంది. రిలీజ్ కు ముందే సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరిగాయో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తోన్న కలెక్షన్స్ ని చుస్తే సినిమా స్థాయి మరింత పెరిగిందని అనిపిస్తోంది.
భరత్ అనే నేను సినిమా ఇప్పటివరకు 100 కోట్ల గ్రాస్ అందుకుందని చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమా డాలర్ల వర్షాన్ని కురిపిస్తోంది. 2 మిలియన్ల డాలర్లను అందుకొని నాన్ బాహుబలి రికార్డును బ్రేక్ చేసింది. ఆదివారం కూడా సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దాదాపు అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరి ఇలానే కొనసాగితే భరత్ అనే నేను మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం పక్కా అని చెప్పవచ్చు.