భరత్ అనే నేను లేటెస్ట్ ఉత్తరాంధ్ర కలెక్షన్ రిపోర్ట్స్

భరత్ అనే నేను లేటెస్ట్ ఉత్తరాంధ్ర కలెక్షన్ రిపోర్ట్స్

Published on Apr 25, 2018 5:23 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో తొలిసారి నటించి మెప్పించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను. విడుదలయిన ప్రతి చోట, ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. అక్కడ, ఇక్కడ అని కాకుండా దాదాపుగా అన్నిచోట్లా మహేష్ బాబు స్టామినా దెబ్బకు కలెక్షన్ రికార్డులు బద్ధలవుతున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్, అలానే ఆంధ్ర లోని కొన్ని ప్రాంతాల్లో నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకుపోతోంది.

ప్రస్తుతం ఈ సినిమా ఉత్తరాంద్ర రీజియన్ 5వ రోజు రూ. 47.8 లక్షల షేర్ వసూలు చేసి, మొత్తంగా ఈ రీజియన్ లో రూ.6.18 కోట్లు షేర్ కొల్లగొట్టిందని ట్రేడ్ పండితులు చెపుతున్నారు. కాగా ఈ వారాంతంలో ఈ సినిమా రూ.7 కోట్ల మార్కు చాలా ఈజీ గా అందుకుంటుందని తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మెసేజి ఓరియెంటెడ్ పొలిటికల్ డ్రామా లో మహేష్ కు జోడిగా కైరా అద్వానీ నటించింది. కాగా డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే…..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు