తిరిగి షూటింగ్లో అడుగు పెట్టిన భావన !

తిరిగి షూటింగ్లో అడుగు పెట్టిన భావన !

Published on Feb 28, 2017 7:26 PM IST


మలయాళంతో పాటు పలు భాషల్లో చిత్రాలు చేసిన నటి భావన పై జరిగిన దాడి మొత్తం దేశంలోని అన్ని సినీ పరిశ్రమల్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటనతో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండే పాపులర్ హారోయిన్లకే రక్షణ లేనప్పుడు సామాన్య మహిళల సంగతేమిటన్న అనుమానం బయలుదేరింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేరళ పోలీసు వ్యవస్థ వేగవంతమైన విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసింది. ఈ ఉదంతంలో ఎలాంటి భయానికి, సంకోచానికి లోనుకాకుండా భావన పోలీసులకు పూర్తి సహాకారం అందించి తన మనో బలాన్ని నిరూపించుకుంది.

ఇప్పుడు కూడా అదే ఆత్మస్థైర్యంతో తిరిగి కెమరా ముందుకొచ్చింది. భావన ఈరోజు నుండి నటుడు పృథ్వీ సుకుమారన్ తో కలిసి చేస్తున్న ‘ఆడమ్’ సినిమా షూట్లో తిరిగి పాల్గొంటోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె సోషల్ నెట్వర్క్ లో ‘జీవితం నన్ను ఎన్నో సార్లు వెనక్కు లాగింది. నేను ఎప్పుడూ చూడకూడదనుకున్న పరిస్థితుల్ని నాకు చూపింది. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నేను ఎప్పుడూ లేచి నిలబడుతూనే ఉంటాను’ అని తెలిపింది. మొదటి నుండి భావనకు అండగా నిలిచిన సినీ పరిశ్రమ ఆమె ధైర్యాన్ని మరోసారి మెచ్చుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు