గెట్ రెడీ టూ మింగిల్ అంటున్న నితిన్

గెట్ రెడీ టూ మింగిల్ అంటున్న నితిన్

Published on Dec 13, 2019 5:20 PM IST

హీరో నితిన్ చేస్తున్న చిత్రాల్లో ‘భీష్మ’ కూడా ఒకటి. సింగిల్ ఫరెవర్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ‘ఛలో’తో మంచి హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై యువ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. దీంతో టీమ్ మరో మొదటి పాటను సిద్దం చేసింది.

ఈ పాటను డిసెంబర్ 27న విడుదల చేయనున్నారు. ఇది కేవలం పాట మాత్రమే కాదని తమ ఎమోషన్ అని అంటున్నారు నితిన్. సాధారణంగానే నితిన్ అన్ని సినిమాల్లో పాటలు బాగుండేలా చూసుకుంటారు. కాబట్టి ప్రత్యేకంగా చేస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ మరింత బాగుండే అవకాశం ఉంది. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు