‘భీష్మ’ హిందీలోకి కూడా వెళ్తున్నాడా ?

‘భీష్మ’ హిందీలోకి కూడా వెళ్తున్నాడా ?

Published on Mar 22, 2020 11:14 PM IST

బాలీవుడ్ నిర్మాతల చూపు టాలీవుడ్ సినిమా కథల పై పడింది. ఈ మధ్య ఇక్కడ సూపర్ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ హిందీలో భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100′, ఓ బేబీ’ చిత్రాల రైట్స్ ను కొనేశారు. అలాగే ‘డియర్ కామ్రేడ్’ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. బీష్మ సినిమా కూడా రీమేక్ అవుతుందట.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడట. ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమా ఓవర్శిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాల్లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఈ సినిమా రెట్టింపు లాభాలనుసొంతం చేసుకుంది. మొత్తానికి, హీరో నితిన్ కి కూడా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమా రణబీర్ కపూర్ కి కూడా సూపర్ హిట్ ని ఇస్తుందా..? అలాగే నితిన్ చేసిన పాత్రలో రణబీర్ కపూర్ ఎలా నటిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు