సమంత సినిమాలో నటిస్తోన్న భూమిక !

సమంత సినిమాలో నటిస్తోన్న భూమిక !

Published on Mar 20, 2018 7:17 PM IST

కన్నడలో విడుదలై విజయం అందుకున్న ‘యుటర్న్’ సినిమాను తెలుగులో సమంత రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు పవన్ కుమార్ ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ కు తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సమంత ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపింబోతోంది.

తాజా సమాచారం మేరకు హీరోయిన్ భూమిక ఈ సినిమాలో దెయ్యం పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో భూమిక పాత్ర చిన్నదే అయినా ఆమె పాత్ర కీలకంగా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి మరో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు