సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయిన భూమిక

సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయిన భూమిక

Published on Apr 20, 2014 8:15 PM IST

bhumika
ప్రస్తుతం చాలా మంది స్టార్స్ తో ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. విలక్షణ హీరో జగపతి బాబు ‘లెజెండ్’ సినిమాతో సక్సెస్ఫుల్ గా విలన్ పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు హీరోయిన్ భూమిక కూడా కంబ్యాక్ మూవీ ‘లడ్డుబాబు’తో మన ముందుకు వచ్చింది. ఈ సినిమాలో భూమిక భర్త చనిపోయిన భార్య పాత్రలో కనిపించింది.

ఈ సినిమా అనుకున్న రేంజ్ హిట్ కాకపోయినప్పటికీ భుమికకి మాత్రం తన పెర్ఫార్మన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి కీలక పాత్రలు, సహాయ నటి పాత్రలు చేయడానికి భూమిక రెడీ గా ఉంది. చెప్పాలంటే ఇదొక మంచి స్టెప్ దీనివల్ల డైరెక్టర్స్, నిర్మాతలకి కూడా ప్రగతి, హేమ లాంటి నటుల విషయంలో చాయిస్ దొరుకుతుంది.

ఇప్పటికీ గ్లామరస్ గా ఉన్నందువల్ల భూమిక ఇలాంటి పాత్రలనూ ఈజీ గా చేయగలదు. రానున్న రోజుల్లో మరి కొన్ని సినిమాల్లో భూమికని చూడగలమని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు