కలెక్షన్స్ రాబడుతున్న బిచ్చగాడు…!

కలెక్షన్స్ రాబడుతున్న బిచ్చగాడు…!

Published on May 27, 2016 3:10 AM IST

bichagadu1
బిచ్చగాడు… ఇలాంటి పేరుతో ఓ సినిమాని ఊహించలేం. అలాంటిది ఓ హీరో ఈ సినిమాలో ’బిచ్చగాడు’ గా నటించడం కూడా ఊహించడానికి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. కేవలం బాగుంది అన్న మాట తప్ప పబ్లిసిటీ కి ఏమాత్రం ఖర్చుపెట్టని సినిమా ఈ రోజు నిర్మాతకు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నట్లు సమాచారం.

విడుదల అయిన మొదటివారం ‘బిచ్చగాడు’ను ఎవ్వరూ పట్టించుకోకపోయినా సినిమా బావుందన్న టాక్ స్ప్రెడ్ అవడంతో ఈ సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం మొదలుపెట్టారు. ఇక గతవారం విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ కు వచ్చిన నెగటివ్ టాక్ ఈ సినిమాకు మరింత పాజిటివ్ గా మారి రెండో వారం నుంచి ‘బిచ్చగాడు’ సినిమా కలెక్షన్స్ పెరిగాయి. ఇక ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. విజయ్ ఆంటోనీ నిర్మాతగా సీనియర్ దర్శకుడు శశి రూపకల్పనలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు