మహేష్ బాబు ఫ్యాన్స్ కి టుడే ఓ స్వీట్ న్యూస్

మహేష్ బాబు ఫ్యాన్స్ కి టుడే ఓ స్వీట్ న్యూస్

Published on Nov 19, 2019 12:02 PM IST

మహేష్ బాబు మోస్ట్ అవైటింగ్ మూవీ సరిలేరు నీకెవ్వరు విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెంచింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ ని విడుదల చేయనున్నారు. కొద్దిరోజుల క్రితం టీజర్ విడుదల చేయనున్నట్లు హింట్ ఇచ్చిన చిత్ర యూనిట్ నేడు సాయంత్రం 6:03నిమిషాలకు టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ మేరకు యూనిట్ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేశారు. టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ నేటి అనౌన్స్మెంట్ తో పండుగ చేసుకోవడం ఖాయం.

ఈనెల 23న ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి జన్మదినం నేపథ్యంలో ఆరోజు టీజర్ విడుదల చేసే అవకాశం కలదని కొందరు భావిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర మరియు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, విజయ శాంతి ఓ కీలక రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు