‘వెంకీ మామ’కు భారీ ఓపెనింగ్స్ ఖాయం

‘వెంకీ మామ’కు భారీ ఓపెనింగ్స్ ఖాయం

Published on Dec 12, 2019 9:38 PM IST

వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి బాబీ డైరెక్షన్లో చేసిన చిత్రం ‘వెంకీ మామ’. దగ్గుబాటి, అక్కినేని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా రేపు డిసెంబర్ 13న విడుదలకానుంది. ఈ చిత్రంపై నిర్మాత సురేష్ బాబు చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే విడుదల తేదీని ముందుకు జరుపుకుని మరీ వస్తున్నారు. సుమారు ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో ఈ చిత్రం విడుదలకానుంది.

ఏపీ, తెలంగాణల్లో 700కి పైగా థియేటర్లలో రిలీజ్ కానుండగా ఓవర్సీస్లో 150కి పైగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 120కి పైగా కలిపి మొత్తం 1000కి పైగా థియేటర్లలో సినిమా ఉండనుంది. పైగా రేపు రానున్న ఏకైక, పెద్ద చిత్రం ఇదొక్కటే కావడంతో సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కనున్నాయి. ఇక ఫస్ట్ డే టాక్ బాగుంటే కుటుంభ కథా చిత్రం కావడంతో శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు