చిన్న సినిమా హీరోకు సపోర్ట్‌గా పెద్ద స్టార్స్!

చిన్న సినిమా హీరోకు సపోర్ట్‌గా పెద్ద స్టార్స్!

Published on Nov 26, 2015 3:54 PM IST

thanu-nenu
సూపర్ స్టార్ మహేష్‌తో ‘బాబీ’, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో ‘వర్షం’ లాంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ‘తను నేను’ అనే సినిమాతో హీరోగా పరిచయమవుతోన్న విషయం తెలిసిందే. వర్షం సినిమాతో ప్రభంజనం సృష్టించిన శోభన్, తన మూడో సినిమాను సిద్ధం చేస్తున్న సమయంలోనే గుండెపోటుతో మృతి చెందారు. మళ్ళీ ఇప్పటికి ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని సంతోష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘అష్టా చమ్మా’, ‘ఉయ్యాల జంపాల’ లాంటి అందమైన సినిమాలను అందించిన నిర్మాత రామ్మోహన్ దర్శకుడిగా మారి తను నేను సినిమా తెరకెక్కించారు.

సంతోష్ సరసన అవికా గోర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా రేపు (నవంబర్ 27న) విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమైన ఈ సందర్భంలో ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ దగ్గర్నుంచి సంతోష్‌కి విషెస్ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. మహేష్, ప్రభాస్, నానిలతో పాటు దర్శకులు ప్రభుదేవా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్ సంతోష్‌కు సపోర్ట్‌గా నిలిచారు. హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంతోష్‌కు అతడి తండ్రి శోభన్ ఆశీస్సులు ఉంటాయని, కచ్చితంగా సంతోష్ అందరినీ ఆకట్టుకుంటాడన్న నమ్మకం ఉందని ఈ స్టార్స్ మాట్లాడుతూ సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు