బాహుబలిని తెగపొగిడేసిన బాలీవుడ్ బాద్షా

బాహుబలిని తెగపొగిడేసిన బాలీవుడ్ బాద్షా

Published on Aug 2, 2015 2:10 PM IST

sharukh

ఇండియన్ లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మరియు సౌత్ ఇండియన్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా ‘బాహుబలి’. జూలై 10న రిలీజ్ అయిన ఈ ఇండియన్ ఫస్ట్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ విడుదలైన నాలుగు భాషల్లోనూ సరికొత్త రికార్డ్స్ ని సృష్టించడమే కాకుండా టాక్ అఫ్ ది ఇండియా గా మారింది. టాలీవుడ్ మాస్టర్ మైండ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని భాషలకు చెందిన సెలబ్రిటీస్ అంతా నీరాజనాలు పట్టారు.

తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా బాహుబలిపై ప్రశంశల జల్లు కురిపించారు. దిల్వాలే సినిమా షూటింగ్ లో భాగంగా గత నెల రోజులుగా బల్గేరియాలో ఉన్న షారుఖ్ ఇండియా తిరిగి రాగానే బాహుబలి సినిమా చూసాడు. ‘ బాహుబలి.. వావ్ ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చిన ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరికీ స్పెషల్ థాంక్స్. మీలో ఆ సతా ఉంటేనే అనుకున్న స్థాయికి రీచ్ కాగలరని’ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేసాడు. గతంలో కూడా షారుఖ్ ఖాన్ రాజమౌళి ఈగ చూసి తన క్రియేటివిటీకి మెచ్చుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు