అల్లు అర్జున్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రిటిక్ !
Published on Jul 3, 2017 4:03 pm IST


బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వివాదాలను కొని తెచ్చుకునే వ్యక్తుల్లో ప్రథముడు కమాల్ ఆర్ ఖాన్. నటుడు, నిర్మాత, సినీ విమర్శకుడు అని చెప్పుకునేఇతడు భాషా బేధం లేకుండా ఎవర్ని పడితే వాళ్ళని అనవసరంగా విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఇంతకూ ముందు కూడా పవన్ కళ్యాణ్, మోహన్ లాల్ వంటి వాళ్ళను విమర్శించి చీవాట్లు తిన్న ఈ వ్యక్తి కొద్దిరోజుల క్రితమే ‘బాహుబలి -2’ చిత్రాన్ని అదసలు సినిమానే కాదన్న స్థాయిలో విమర్శించి చివరికి రూ. 1700 కోట్ల వసూళ్లు చూసి బిక్క మొహం వేశాడు.

ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ స్టార హీరో అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ ‘ఈరోజు ఎవరో లుక్కా లుకింగ్ ఆలూ తెలుగులో పెద్ద స్టార్ అని అన్నారు. బ్రో ఒకవేళ నీకు చిన్న చిన్న పాత్రలు చేయాలని ఉంటే బాలీవుడ్ కి రా’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేశాడు. దీంతో బన్నీ అభిమానులు అతగాడి వ్యాఖ్యలకు ఘాటైన ప్రతి విమర్శలు చేస్తున్నారు. అంతేగాక ‘సరైనోడు’ హిందీ వెర్షన్ యూట్యూబ్ లో చేసిన సంచలనం, ‘డీజే’ సల్మాన్ ఖాన్ యొక్క ‘ట్యూబ్ లైట్’ వసూళ్లను మించిన ఉదంతాల్ని గుర్తుచేసి మరీ చీవాట్లు పెడుతున్నారు.

 
Like us on Facebook