అర్ధరాత్రి.. చరణ్ సెట్లో బాలీవుడ్ స్టార్ హీరో సందడి

అర్ధరాత్రి.. చరణ్ సెట్లో బాలీవుడ్ స్టార్ హీరో సందడి

Published on Oct 6, 2015 6:03 PM IST

ram-charan-and-sharuq
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమా చివరి దశ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. గత రెండు రోజులుగా ఏ మాత్రం గ్యాప్ లేకుండా రామ్ చరణ్ – రకుల్ ప్రీత్ సింగ్ లపై ‘లీ లీ బ్రూస్ లీ’ సాంగ్ ని షూట్ చేసారు. ఈ రోజు ఉదయంతో ఆ సాంగ్ షూటింగ్ పూర్తయ్యింది. కానీ ఈ సాంగ్ షూట్ జరుగుతున్న టైంలో వీరికి ఓ సర్ప్రైజ్ కలిగింది. అదే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్రూస్ లీ సెట్స్ ని విజిట్ చేయడం. ప్రస్తుతం రోహిత్ శెట్టి డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ నటిస్తున్న దిల్ వాలే సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది.

ఈ సందర్భంగా షారుఖ్ తన షూటింగ్ పూర్తి చేసుకున్నాక చరణ్ సెట్లోకి వచ్చాడు. అలా అక్కడ అందరినీ పలకరించిన షారుఖ్ రామ్ చరణ్ తో కాసేపు పిచ్చాపాటి మాట్లాడటమే కాకుండా రామ్ చరణ్ స్టెప్స్ ని బాగా ఎంజాయ్ చేసాడట. రాత్రి 2 గంటల వరకు చరణ్ తో పాటు సెట్లో ఎంజాయ్ చేసి తర్వాత షారుఖ్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడట. షారుఖ్ కి రామ్ చరణ్, చిరు ఫ్యామిలీతో ముందు నుంచే మంచి అనుభందం ఉంది. రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాని అక్టోబర్ 16న రిలీజ్ చెయ్యడానికి ఎక్ష్త్రా టైం షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. శ్రీనువైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు