వెంకటేష్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ?
Published on Dec 11, 2017 1:27 pm IST

‘గురు’ సినిమా తరువాత వెంక‌టేష్ తేజ దర్శకత్వంలో నటించబోతున్న సినిమా ఈ మధ్యే రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి అథితిరావ్ హైదరి నటించనుందని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ‘చెలియా’ సినిమాతో తెలుగులోకి ఏంట్రీ ఇచ్చిన అదితిరావ్ హైదరికి ఇక్కడ మంచి మంచి అవకాశాలే లభిస్తున్నాయి. ఈరోజే మొదలైన సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన్ కృష్ణల సినిమాలో కూడా అదితి రావ్ నటించనుంది.

 
Like us on Facebook