స్టార్ డమ్ పెరిగేకొద్ది ప్రభాస్ లో వస్తున్న మార్పును వివరించిన బాలీవుడ్ నటుడు !
Published on Jul 13, 2017 9:39 am IST


రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న తాజా చిత్రం ‘సాహో’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘బాహుబలి’ ఘన విజయం తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళ ఆసక్తి తగ్గట్టే ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు బోలెడున్నాయి. అందులో ప్రభాస్ కు ప్రతి నాయకుడిగా బాలీవుడ్ స్టార్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నటిస్తుండటం కూడా ఒకటి.

తాజాగా మీడియాతో మాట్లాడిన నీల్ నితిన్ ముఖేష్ ‘బాహుబలి’ సినిమా విడుదలవడానికి ముందే నేనీ సినిమాకు ఒప్పుకున్నాను. సాంకేతిక పరంగా సినిమా చాలా గొప్పగా ఉంటుంది. ఇక ప్రభాస్ మంచి మనసున్న పెద్ద స్టార్. చాలా సాధారణంగా ఉంటారు. స్టార్ డమ్ పెరిగే కొద్ది ఆయనలో వినయం కూడా ఎక్కువవుతూ ఉంది అంటూ ప్రభాస్ ను మనస్ఫూర్తిగా పొగిడేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగుతో పాటు తమిళం, హిందీల్లో కూడా రూపొందిస్తున్నారు.

 
Like us on Facebook