రజనీకాంత్ సినిమాలో మరోక పాపులర్ నటుడు !

రజనీకాంత్ సినిమాలో మరోక పాపులర్ నటుడు !

Published on May 28, 2017 7:28 PM IST


సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కాల’ ఈరోజే ముంబైలో మొదలైంది. ఈ రెగ్యులర్ షూట్లో రజనీ కూడా పాల్గొన్నారు. ముంబై మాఫియా నైపథ్యంలో ఉండబోయే ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అందుకొరకు ఆయా భాషల్లో బాగా పాపులర్ అయిన నటీనటుల్ని ఈ సినిమా కోసం ఎంచుకున్నారు దర్శకుడు పా. రంజిత్.

తాజాగా ఈరోజూ ఉదయం చేసిన ప్రకటనలో బాలీవుడ్ పాపులర్ నటుల్లో ఒకరైన నానా పటేకర్ ను ఈ చిత్రంలో ఒక కీ రోల్ చేయడానికి తీసుకున్నామని రంజిత్ తెలిపారు. అలాగే హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు సముతిరకని కూడా ఇందులో నటిస్తున్నారు. ఇకపోతే ఈ ముంబై షెడ్యూల్ సుమారు 40 రోజుల పాటు నిర్విరామంగా జరుగుతుందని తెలుస్తోంది. వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు