పార్టీ మారిన ఊర్మిళ మటొండ్కర్

పార్టీ మారిన ఊర్మిళ మటొండ్కర్

Published on Dec 1, 2020 10:27 PM IST

బాలీవుడ్‌ నటి, కాంగ్రెస్‌ మాజీ నేత ఊర్మిళ మటొండ్కర్ పార్టీ మారారు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ముంబయి నార్త్ నియోజకవర్గం నుండి ఎంపీ స్థానానికి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అప్పటి నుండి ఆమెకు, కాంగ్రెస్ పెద్దలకు మధ్యన విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో గత కొన్నిరోజులుగా ఆమె పార్టీని వీడతారనే వార్తలు మొదలయ్యాయి. ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడ రాజీనామా చేశారు.

మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం మాతోశ్రీలో ఆమె శివసేన పార్టీలో చేరారు. ఈ విషయాన్ని శివసేన ధృవీకరించింది. అలాగే త్వరలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే మహారాష్ట్ర శాసన మండలిలోని 12 స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటి భర్తీకి సంభందించిన కసరత్తులు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆమె పార్టీ మారడంతో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఖాయమనే ప్రచారం కూడ జరుగుతోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ శివసేన మీద నిప్పులు చెరుగుతున్న తరుణంలో ఊర్మిళ అదే పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు