ఇంటర్వ్యూ : బోయపాటి శ్రీను – శ్రీనివాస్ లాంటి కుర్రాడు మన ఇంట్లో ఉంటే బాగుటుంది అనుకుంటారు !

ఇంటర్వ్యూ : బోయపాటి శ్రీను – శ్రీనివాస్ లాంటి కుర్రాడు మన ఇంట్లో ఉంటే బాగుటుంది అనుకుంటారు !

Published on Aug 9, 2017 1:54 PM IST


మాస్ ప్రేక్షకుల నాడిని పట్టుకుని సినిమాల్ని భారీ బ్లాక్ బస్టర్లుగా మలచగల సత్తా ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పటి వరకు స్టార్ హీరోలతోనే సినిమాలు చేసిన ఆయన ఈసారి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘జయ జానకి నాయక’ ను తెరకెక్కించారు. ఈ శుక్రవారం రిలీజ్ కానున్న ఈ చిత్రం తప్పక హిట్టవుతుందని అంటున్న బోయపాటి పలు విశేషాల్ని మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘జయ జానకి నాయక’ ఎలా ఉండబోతోంది ?
జ) ఇది ప్రతి ఒక్క ప్రేక్షకుడి గుండెను చేరే సినిమా అవుతుంది. ‘భద్ర’ తర్వాత అదే జానర్లో నేను చేసిన సినిమా. ఎన్నాళ్లగానో ఈ కథ చేయాలని అనుకున్నా. కానీ యాక్షన్ పంథాలోకి వెళ్లడం వలన చేయలేకపోయా. ఇప్పుడు శ్రీనివాస్ దొరకడంతో చేశా.

ప్ర) ఎప్పుడూ గంభీరమైన టైటిల్స్ పెట్టె మీరు ఈసారి సాఫ్ట్ టైటిల్ పెట్టారెందుకు ?
జ) అవును. ఈ టైటిల్ కొంచెం భిన్నంగా ఉంటుంది. కానీ కథకి కనెక్టై ఉంటుంది. సినిమా చూశాక టైటిల్ కరెక్టే అనిపిస్తుంది.

ప్ర)’సరైనోడు’ తర్వాత పెద్ద హీరోతో సినిమా చేయకుండా చిన్న హీరోతో చేయడమేమిటి ?
జ) ‘సరైనోడు’ ఒక జానర్ సినిమా. ఇదొక జానర్ సినిమా. నా ఇంతకు ముందు సినిమాలాటి పోల్చుకుని ఈ సినిమా ఒక పాయింట్ ఎక్కువగానే ఉటుంది తప్ప తగ్గదు. చిన్న హీరో కదా అని నా స్థాయికి తగ్గి సినిమా చేయను. డిస్ట్రిబ్యూటార్లకు నా సినిమా అంటే ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా కూడా ఉంటుంది.

ప్ర) శ్రీనివాస్ తో ముందు ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది కదా అదీ ఇదీ ఒకటేనా ?
జ) లేదు. అది వేరే కథ. అది అప్పటి టైమ్ కి సరిపోయే కథ. ఇది ఇప్పటి టైమ్ కి సరిపోయే కథ.

ప్ర) మీ యాక్షన్ డోస్ ను శ్రీనివాస్ క్యారీ చేయగలడా ?
జ) నా సినిమాలో యాక్షన్ హీరోని బట్టే ఉంటుంది. ఎంత హెవీగా ఉన్నా అది హీరోలోనించే వస్తుంది. ఇందులో 24 ఏళ్ల కుర్రాడికి ఎలాంటి యాక్షన్ పెట్టాలో అదే పెట్టాం.

ప్ర) మూడు సినిమాలతో కలిసి వస్తోంది కదా ఏమైనా టెంక్షన్ ఉందా ?
జ) లేదు. ఎలాంటి టెంక్షన్ లేదు. ఎందుకంటే సినిమా అంత బాగా వచ్చింది కాబట్టి.

ప్ర) ఇన్తకు ముందు దేవిశ్రీతో ఇషయో జరిగింది. ఇప్పుడు జర్నీ ఎలా సాగింది ?
జ) దేవిశ్రీ నాకు చాలా మంచి ఫ్రెండ్. జర్నీలో అలాంటి చిన్న చిన్న ఎదురుదెబ్బలు సాధారణం. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కథలో నుండే పాటలు పుట్టాయి కనుక చాలా సులభంగా చేసేశాడు. బిజిఎం అయితే అదరగొట్టాడు.

ప్ర) మీ సినిమాలో యాక్షన్ తప్పనిసరి ఎందుకు ?
జ) అది నా సినిమా హెల్తీగా ఉంటుందని నా నమ్మకం. అందుకే యాక్షన్ ను వదలను. ఆ యాక్షన్ కూడా ఎమోషన్ తో కూడి ఉంటుంది. సీట్లలో కూర్చున్న ప్రేక్షకులు కొట్టాలి అంటేనే హీరో కొడతాడు. అంతలా జనానికి కనెక్టవుతుంది.

ప్ర) పెద్ద నటీనటుల్ని తీసుకున్నారు. శ్రీనివాస్ కోసమేనా ?
జ) లేదు. నా సినిమాలో ఎప్పుడూ స్టార్ కాస్ట్ ఉంటూనే ఉంటారు. అందరికీ కథలో ప్రాధాన్యముంటుంది. అంతేకానీ శ్రీనివాస్ కోసం కాదు.

ప్ర) భారీ బడ్జెట్ అయ్యుంటుంది కదా శ్రీనివాస్ తో అదంతా వెనక్కి వస్తుందా ?
జ) ఈ సినిమాలో స్టార్ హీరో లేడు. కానీ మంచి కథ ఉంది. అందుకే ఎలాంటి టెంక్షన్ప్ లేదు. ఇక డబ్బులు అంటారా డిస్ట్రిబ్యూటర్లంతా లెక్కలు వేసుకునే సినిమాను కొనుక్కున్నారు.

ప్ర) ఈ సినిమాలో మెసేజ్ ఏమైనా ఉంటుందా ?
జ) ఉంటుంది. నా ప్రతి సినిమాలోను సమాజానికి కావాల్సిన ఏదో ఒక మెసేజ్ ఇస్తాను. ఈ సినిమాలో కూడా ఇచ్చాను. సొసైటీకి మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేయకుండా ఉంటే చాలు అని చెప్పాను.

ప్ర) సినిమాలో శ్రీనివాస్ పాత్ర ఎలా ఆకట్టుకుంటుంది ?
జ) సినిమా చూసిన వాళ్ళు శ్రీనివాస్ బాగా యాక్టింగ్ చేశాడు, బాగా ఫైట్స్ చేశాడు, డైలాగ్స్ చెప్పాడు అనరు. ఇలాంటి కుర్రాడు ఒకడు మన ఇంట్లో ఉంటే బాగుటుంది అంటారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు