బోయపాటి – బెల్లంకొండల చిత్ర విడుదల తేదీ ఇదే !

బోయపాటి – బెల్లంకొండల చిత్ర విడుదల తేదీ ఇదే !

Published on Apr 22, 2017 6:57 PM IST


యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రం స్టార్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించుకున్న ఈచిత్ర విడుదల తేదీని ప్రకటించారు.ఈ చిత్రం జులై 7 న విడుదలవుతుంది.

కాగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యాజైశ్వాల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది.జగపతిబాబు ఈచిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.భారీ బడ్జెట్ లో ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈచిత్ర డబ్బింగ్ మొదలు కాగా మిగిలిన కొద్ది భాగం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు