కాంపిటీషన్ ఉన్నా ఆ డేట్ పైనే గురిపెట్టిన బెల్లంకొండ
Published on Jul 8, 2017 4:51 pm IST


యువ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘జయ జానకి నాయక’ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగష్టు 11 న విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇదే తేదీన మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. నితిన్ నటించిన ‘లై’ చిత్రం ఆగష్టు 11 న విడుదలవుతున్నట్లు ఆ చిత్ర యూనిట్ ప్రకటించేసింది. రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం కూడా అదే తేదీన విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 11 న మంచి అంచనాలు ఉన్న రెండు చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నా అదే తేదీన బోయపాటి – బెల్లంకొండల చిత్రాన్ని విడుదల చేసినందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేథరిన్ ప్రత్యేక గీతం లో మెరవనుండగా, అలనాటి నటీమణులు వాణి విశ్వనాథ్, సితార లు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

 
Like us on Facebook