‘అల్లుడు శీను’ గెటప్ మారుతుంది – బోయపాటి శీను.

‘అల్లుడు శీను’ గెటప్ మారుతుంది – బోయపాటి శీను.

Published on Sep 18, 2014 5:00 PM IST

boyapati-belam-konda
‘అల్లుడు శీను’తో మాస్ కమర్షియల్ హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్… తన తదుపరి సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ మూవీలో కొంచం సన్నగా, షార్ట్ హెయిర్ తో కనపడిన ఈ ఆరడుగుల అందగాడు బోయపాటి సినిమాలో నయా గెటప్ లో దర్శనం ఇవ్వనున్నాడు. ప్రస్తుతం జింలో కష్టపడుతూ కండలు పెంచుతున్నాడు. హెయిర్ స్టైల్ కూడా మారుస్తున్నాడు.

ఈ సినిమా గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఇది పూర్తిగా ప్రేమ కథ. నా స్టైల్ అఫ్ యాక్షన్ ఉంటుంది. ‘అల్లుడు శీను’కి, ఈ సినిమాకి బెల్లంకొండ శ్రీనివాస్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కొంచె బాడీ బిల్డప్ చేయమన్నాను. హెయిర్‌ స్టయిల్‌ కూడా చేంజ్ చేస్తున్నాం. కొంత సమయం పడుతుంది. దానికోసమే వెయిట్‌ చేస్తున్నా. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు