చరణ్ తో తలపడే విలన్ అతనేనా ?

చరణ్ తో తలపడే విలన్ అతనేనా ?

Published on Dec 18, 2017 3:15 PM IST

హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్ సినిమాలు తీయడంలో బోయపాటి శ్రీను దిట్ట. తాజాగా బోయపాటి రామ్ చరణ్ తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. జనవరి రెండో వారం నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అను ఇమ్మానుల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ లో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను వివేక్ ను కలిసి స్క్రిప్ట్ చెప్పడం జరిగిందట. బోయపాటి సినిమాల్లో విలన్స్ పవర్ ఫుల్ గా ఉంటారు. ఆ తరహాలోనే వివేక్ పాత్ర ఉండబోతుందని సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వవెలువడలేదు. డివివి దానయ్య నిర్మించే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిచబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు