బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ రేపే !

బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ రేపే !

Published on Jun 29, 2017 11:47 AM IST


స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేస్తున్న తాజా చిత్రం ‘జయ జానకి నాయక’. ‘సరైనోడు’ వంటి భారీ సక్సెస్ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. కొన్ని రోజుల క్రితమే భిన్నమైన టైటిల్ ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ను కూడా సిద్ధం చేసింది.

రేపు ఉదయం 10 గంటల 15 నిముషాలకు ఫస్ట్ లుక్ ను రీలీజ్ చేయనున్నారు. శ్రీనివాస్ సరసన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రంలో క్యాథరిన్ థ్రెస, జగపతి బాబు వంటి వారు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా యొక్క నైజాం హక్కుల్ని రూ. 9 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడంతో అందరిలోనూ సినిమా ఎలా ఉందో అనే ఉత్సుకత బయలుదేరింది. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు