నేను డైరెక్టర్ అవాలనుకోవడంలేదన్న స్టార్ కమెడియన్ !

Brahmanandam
తెలుగు పరిశ్రమ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం త్వరలో ఓ సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నాడని అందులో ట్రెండింగ్ యాంకర్స్ రష్మి, అనసూయలు నటించనున్నారని కొన్నిరోజులుగా రకరకాల వార్తలు పుట్ట్టుకోసున్నాయి. వీటిపై స్పందించిన బ్రహ్మానందం మాట్లాడుతూ ‘నేను డైరెక్షన్ చేయాలనుకోవడం లేదు. ఒకవేళ డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఎప్పుడో అవ్వాల్సింది. ఇప్పుడు ఆ పని చేయాల్సిన అవసరం లేదు’ అంటూ రూమర్లకు చెక్ పెట్టారు.

అలాగే ‘నేను ఎన్నాళ్లగానో పద్యాలు రాస్తున్నాను. ఇప్పటి వరకూ వాటిని బయటకి తేలేదు. త్వరలోనే వాటన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను’ అన్నారు. ఇకపోతే బ్రహ్మానందం తనయుడు గౌతమ్ నూతన దర్శకుడు ఫణీంధ్ర నరిశెట్టి డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దశలో ఉందని త్వరలోనే ప్రమోషన్ మొదలవుతాయని తెలుస్తోంది.

Bookmark and Share