నాగ చైతన్య టీజర్‌లో బ్రాహ్మి పంచ్..

నాగ చైతన్య టీజర్‌లో బ్రాహ్మి పంచ్..

Published on Nov 22, 2014 8:31 PM IST

brhmanandam
నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా అతని కొత్త సినిమా టీజర్ ను నేడు విడుదల చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. చైతన్య చాలా స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. కృతి సనన్ అందంగా కనిపించింది. ‘స్వామి రా రా’ తర్వాత దర్శకుడు మరోసారి క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమాతో చైతు కెరీర్లో మరో హిట్ చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

‘ప్రతి మోసం వెనుక ఇద్దరు ఉంటారు..మోసం చేసేవాడు… మోసపోయేవాడు… రెండోవాడివి కాకుడదంటే… మొదటివాడివి అయ్యి తీరాలి. అనే డైలాగ్ బాగుంది. చైతు రెండోవాడిగా మారి మోసం చేయడానికి నిర్ణయించుకున్నదనమాట. టీజర్ చివరిలో టైటిల్ ఏంటో..? చెప్పలేదు అంటే ‘ఇంకా మాకే దొరకలేదు’ అంటూ బ్రహ్మానందం వేసిన పంచ్ డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

ఇప్పటికే ఈ సినిమాకి టైటిల్ ఖరారు అయ్యిందంటూ మీడియాలో పలు పుకార్లు షికారు చేశాయి. టీజర్ తో అటువంటి వార్తలు గట్టిగా చెక్ పెట్టినట్టు అయ్యింది. వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడు.

టీజర్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు