‘బ్రహ్మోత్సవం’ ఆడియో కూడా ఏప్రిల్‌లోనే..?

‘బ్రహ్మోత్సవం’ ఆడియో కూడా ఏప్రిల్‌లోనే..?

Published on Feb 7, 2016 7:57 PM IST

brahmosthavam
‘బ్రహ్మోత్సవం’.. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సూపర్ హిట్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి అందమైన సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడం, బ్లాక్‌బస్టర్ హిట్ ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ చేస్తోన్న సినిమా కావడం లాంటి విషయాలతో పాటు జనవరి 1న విడుదలైన టీజర్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పీవీపీ సంస్థ పెద్ద ఎత్తున సినిమాను నిర్మిస్తోంది.

ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఏప్రిల్ నెలాఖర్లో విడుదల కానుండగా, ఏప్రిల్ మొదటివారంలో ఆడియో రిలీజ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతోన్న సమాచారం మేరకు ఏప్రిల్ 8న ‘బ్రహ్మోత్సవం’ ఆడియో రిలీజ్ చేపట్టాలని పీవీపీ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణిత.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటిస్తోన్న ఈ సినిమాలో 30 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు నటిస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు