‘బ్రహ్మోత్సవం’ మొదటి వారం నైజాం కలెక్షన్స్!

‘బ్రహ్మోత్సవం’ మొదటి వారం నైజాం కలెక్షన్స్!

Published on May 27, 2016 11:27 AM IST

brahmotsavam
సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున గత వారం విడుదలైన విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా, సినిమా మాత్రం వారిని అనుకున్నంత మేర ఆకట్టుకోలేకపోయింది. మొదటిరోజు నుంచే మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతం మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది. అయితే సోమవారం నుంచి కలెక్షన్స్ నెమ్మదించాయి.

ఇక మొదటి వారం మొత్తం పూర్తయ్యే సరికి నైజాం ఏరియాలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా 8.35 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. సినిమాను నైజాం ప్రాంతంలో విడుదల చేసిన అభిషేక్ పిక్చర్స్ ఈ కలెక్షన్స్‌ను అధికారికంగా ప్రకటించింది. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు