ఇంటర్వ్యూ : మహేష్ బాబు – కుటుంబ విలువలు గుర్తు చేసేందుకే ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేసా..!

ఇంటర్వ్యూ : మహేష్ బాబు – కుటుంబ విలువలు గుర్తు చేసేందుకే ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేసా..!

Published on May 16, 2016 8:30 PM IST

mahes-hbabu
టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు … అందరికి అదో ఆసక్తి .. తెలుగులో వంద కోట్ల మార్కెట్ ని క్రాస్ చేసి తనదైన క్రేజ్ తో దూసుకుపోతున్నాడు మహేష్. అయన నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి బ్యానర్ పతాకం పై పరమ్ వి పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20 న విడుదలకు సిద్దం అయింది. మహేష్ సరసన ముగ్గులు హీరోయిన్స్ కాజల్, సమంతా , ప్రణీత లు నటిస్తున్నారు. ఈ సందర్బంగా మహేష్ బాబుతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు :

ప్రశ్న) ‘బ్రహ్మోత్సవం’ టైటిల్ ఎందుకు పెట్టారు ?

స) ఇప్పుడున్న రోజుల్లో మనం కెరీర్ కోసమనీ డబ్బు సంపాదన కోసమనీ పరుగులు తీస్తున్నాం .. దాంతో కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు .. అందుకే ఆ కుటుంబ విలువలను గుర్తు చేసేందుకే ఈ సినిమా .. మనమందరం కలిస్తే ‘బ్రహ్మోత్సవం’ లా ఉంటుందని చెప్పే ప్రయత్నం.

ప్రశ్న) లవ్ స్టొరీ ఉంటుందని తెలిసింది ?

స) అవును. కుటుంబం నేపథ్యం లో సాగే ఈ సినిమాలో మంచి లవ్ స్టొరీ కూడా ఉంటుంది. దాంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ .. సెంటిమెంట్ అన్నీ మన జీవితానికి దగ్గరగా ఉంటాయి.

ప్రశ్న) గతంలో ‘సీతమ్మ వాకిట్లో ..’ సినిమా చేసారు .. ఆ సినిమాకు దీనికి ఏవైనా పోలికలు ఉన్నాయా ?

స) అస్సలు లేవు. ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంటుంది. ఇది చాలా కొత్త కాన్సెప్ట్, ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలు చేయలేదు .. చాలా ఫ్రెష్ ఫిలిం అని చెప్పాలి.

ప్రశ్న) సినిమా కోసం ఎక్కువ రోజులు పట్టింది? కారణం ?

స) ఈ సినిమాకోసం చాలా అవుట్ డోర్స్ షూటింగ్ చేసాం. ఇప్పటి వరకు నేను ఏ సినిమాకు ఇన్ని ఊర్లు తిరగలేదు. అందుకే ఈ సమయం పట్టింది.

ప్రశ్న) ఈ సినిమాకోసం భారి బడ్జెట్ అయిందని తెలిసింది ?

స) కథ అలాంటిది .. చాలా ఎక్కువమంది ప్రముఖ నటీనటులు ఉండడం… ముఖ్యంగా కథను నిర్మాత బాగా నమ్మాడు కాబట్టే ఇంత క్వాలిటీ గా సినిమా తీయగలిగాడు. ఎక్కడ ఏ అవసరం వచ్చిన దాన్ని వద్దనకుండా అయన ఖర్చు పెట్టారు.

ప్రశ్న) ‘శ్రీమంతుడు’ సినిమాతో సోషల్ మెసేజ్ చెప్పారు. మరి ఈ సినిమాతో ఏం చెబుతున్నారు ?

స) మెసేజ్ అంటూ ఏమీ లేదు. ఇదో కమర్షియల్ సినిమా. ‘శ్రీమంతుడు’ సినిమా తరువాత ‘బ్రహ్మోత్సవం’ లాంటి సినిమా చేయడం అదృష్టంగా బావిస్తున్నాను. ఎందుకంటే ఒకే తరహా సినిమాలు కాకుండా భిన్నమైన సినిమాలు చేసే ఛాన్స్ దక్కింది. ‘శ్రీమంతుడు’ సినిమా సమయం లోనే ఈ కథను శ్రీకాంత్ నాకు చెప్పాడు. అప్పుడు ఓకే అయిన కథే ఇది.

ప్రశ్న) నెక్స్ట్ సినిమా ఎప్పుడు? ఎవరితో ?

స) మురుగదాస్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నా. ఇది తెలుగు, తమిళ్ రెండు భాషలలో విడుదల చేస్తాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు