‘బ్రహ్మోత్సవం’ పశ్చిమ గోదావరి కలెక్షన్స్

‘బ్రహ్మోత్సవం’ పశ్చిమ గోదావరి కలెక్షన్స్

Published on May 25, 2016 1:00 PM IST

Brahmotsavam
బ్రహ్మోత్సవం.. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గత శుక్రవారం భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. మహేష్‌కు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమమాపై తారాస్థాయిలో ఉన్న అంచనాలను మహేష్-శ్రీకాంత్ అడ్డాలలు అందుకోలేకపోయారు. మొదటిరోజు నుంచే మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా మహేష్ సినిమా స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది.

మొదటి మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణాల్లో 21 కోట్ల 48 లక్షల రూపాయల షేర్ వసూలు చేసిన ఈ సినిమా, ఆ తర్వాత పూర్తిగా నెమ్మదించింది. పశ్చిమ గోదావరి ఏరియాలో 5 రోజుల్లో ఈ సినిమా 2,41,30,600 రూపాయల షేర్ వసూలు చేసింది. పీవీపీ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు