‘బ్రహ్మోత్సవం’ తూర్పు గోదావరి కలెక్షన్స్!

‘బ్రహ్మోత్సవం’ తూర్పు గోదావరి కలెక్షన్స్!

Published on May 25, 2016 5:04 PM IST

bramhotsavam-m
సూపర్ స్టార్ మహేష్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా భారీ అంచనాల మధ్య గత శుక్రవారం విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు మొదటిరోజునుంచే మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి వారాంతం కలెక్షన్స్ బాగున్నా, ఆ తర్వాత కలెక్షన్స్ మెల్లిగా తగ్గుముఖం పట్టాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని మొదటివారాంతం 21 కోట్ల 48 లక్షల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, ఆ తర్వాత రోజు నుంచి నెమ్మదించింది.

తూర్పు గోదావరి ప్రాంతంలో మొదటి ఐదు రోజుల్లో ఈ సినిమా 2.32 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. వచ్చే వారం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో బ్రహ్మోత్సవం ఆ ప్రభావంతో కలెక్షన్స్ రాబడుతుందేమో చూడాలి. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు