అల్లరోడి ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’కి సూపర్బ్ బిజినెస్.!

అల్లరోడి ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’కి సూపర్బ్ బిజినెస్.!

Published on Oct 30, 2014 4:40 PM IST

Brother-of-bommali1
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమాలో అల్లరి నరేష్ కి బెండు తీసే బ్రదర్ అఫ్ బొమ్మాళి పాత్రలో కార్తీక కనిపించనుంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమా రిలీజ్ రెండు వారల ముందుగానే ఈ సినిమా టోటల్ బిజినెస్ అయిపొయింది. దాంతో ఈ చిత్ర టీం అంతా హ్యాపీగా ఉన్నారు. అన్ని ఏరియాల్లో అమ్మేసినా నిజాం లో మాత్రం అల్లరి నరేష్ ఈ సినిమాని ఆన్ రీలీజ్ చేస్తున్నారు. అంతే కాకుండా విడుదలకి ముందే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని సమాచారం. బిజినెస్ పరమగా ఈ సినిమా నిర్మాతలు హ్యాపీ అవ్వడంతో వచ్చే వారం నుంచి జోరుగా ప్రచార కార్యక్రమాలు చేయనున్నారు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియోకి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘సుడిగాడు’ తర్వాత అల్లరి నరేష్ మరోసారి మోనాల్ గజ్జర్ తో రొమాన్స్ చేస్తున్న ఈ సినిమాకి చిన్నికృష్ణ డైరెక్టర్. అమ్మిరాజు నిర్మిస్తున్న ఈ మూవీకి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. గత కొద్ది రోజులుగా సరైన హిట్ లేని అల్లరి నరేష్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకుంటానని ఈ చిత్ర టీం ఎంతో నమ్మకంగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు