‘బ్రూస్ లీ’ తమిళ్ ఆడియో రిలీజ్ డేట్

‘బ్రూస్ లీ’ తమిళ్ ఆడియో రిలీజ్ డేట్

Published on Oct 5, 2015 11:15 AM IST

bruce-lee
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘బ్రూస్ లీ’ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాడు. అనుకున్న టైంకి సినిమాని ప్రేక్షకులకు అందించాలని ఎక్స్ట్రా టైం కూడా వర్క్ చేస్తున్నాడు. దరసరా కానుకగా అక్టోబర్ 16న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో ‘బ్రూస్ లీ 2’ పేరుతో రిలీజ్ కానుంది. ఇటీవలే తెలుగులో విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది, దాంతో తమిళంలో కూడా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు.

తాజా సమాచారం ప్రకారం బ్రూస్ లీ 2 ఆడియోని అక్టోబర్ 7న చెన్నైలో రిలీజ్ చేయనున్నారు. తమిళ డిస్ట్రిబ్యూటర్ భద్రకాళి ఫిల్మ్స్ అధినేత భద్రకాళి ప్రసాద్ తమిళ్ లో గ్రాండ్ గానే ఆడియో లాంచ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఓ ప్రముఖ తమిళ హీరో కూడా ఈ ఆడియో లాంచ్ కి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తన మార్క్ కామెడీతో పాటు, సూపర్బ్ యాక్షన్ సీన్స్ కూడా ఉండేలా ప్లాన్ చేసాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నదియా, కృతి కర్భంద, రావు రమేష్, అరుణ్ విజయ్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు